మాకు మిమ్మల్నిఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తాం-డిప్యూటి సీ.ఎం
విధి నిర్వహణలో వున్న అధికారిపై దాడి..
అమరావతి: అధికారులపైన దాడి చేయడం వైసీపీకి కొత్త కాదని,,వారు ఇంకా వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని,, ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు..శనివారం అన్నమయ్య జిల్లా గాలివీడు MPDO జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడాని పవన్ కల్యాణ్ ఖండించారు..కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పవన్ కల్యాణ్ పరామర్శించి అయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.. బాధితుడు MPDO జవహర్ బాబుకు, కుటుంబసభ్యులకు ‘‘ నేనున్నాను.. ధైర్యంగా ఉండమని’’ పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో వైసీపీ నాయకులకు అధికారులపై దాడి చేయడం పరిపాటిగా మారిందని,, ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.. MPDOపై దాడి చేసిన వైసీపీ నేతకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలో కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు..అధికార దాహంతో అనధికార పెత్తనం చెలాయించాలని ఆధిపత్య ధోరణితో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు..‘‘మాకు మిమ్మల్నిఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం’’ అని స్పష్టం చేశారు..పరారిలో ఉన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.. రాయలసీమలో మహిళలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు..
MPDOల సంఘం ప్రతినిధులు:- గాలివీడు మండల ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటన నేపథ్యంలో విధుల్లో ఉన్నఅధికారులు, ఉద్యోగులకు భరోసా, ధైర్యం ఇవ్వాలని MPDOల సంఘం ప్రతినిధులు రాష్ర్ట ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.. రాయచోటిలో పవన్ కళ్యాణ్ ని కలిసిన MPDOల సంఘం ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు..వారు ప్రస్తావించిన అంశాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ లతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు.