DISTRICTS

టిడ్కో కాలనీ సమీపంలో ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు-ఏపీ టిడ్కో చైర్మన్‌

నెల్లూరు: నెల్లూరు వేంకటేశ్వరపురం ఫేజ్‌ 1 టిడ్కో కాలనీలో ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. టిడ్కో కాలనీ సమీపంలో ఖాళీ స్థలములను ఆక్రమించి వివిధ మతములుకు చెందిన ప్రార్థనా స్ధలములను అనుమతి లేకుండా నిర్మాణములు చేపట్టిన విషయమై వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి తక్షణమే ఆక్రమణలను తొలగించారు. మున్ముందు ఎవరైనా ఈ విధముగా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *