ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం-5 మంది మృతి
50 మందికి తీవ్ర గాయాలు..
అమరావతి: అనకాపల్లి పరిధిలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..బుధవారం మధ్యహ్నం రియాక్టర్ పేలిన ఘటనలో 5 మంది కార్మికులు మృతిచెందగా,దాదాపు 50 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.. పేలుడు ధాటికి పరిశ్రమలోపుల వున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి..మరికొన్ని భాగాలు అయితే సమీపంలో ఉన్న చెట్టుపై పడ్డాయి..గాయాపడిన బాధితులందరినీ హుటాహుటిన అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి యాజమాన్యం తరలించింది.. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకున్నాయి..ఎసెన్సియా కంపెనీలో ఉద్యోగులు, కార్మికులు మధ్యాహ్న భోజనం విరామ సమయంలో వుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది..అదే కార్మికులు అంతా పనిలో వున్నప్పుడు ప్రమాదం జరిగి వుంటే,,ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా వుండేదని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి..గురువారం సీ.ఎం చంద్రబాబు అచ్యుతపురం వెళ్లనున్నారు.