పొలాండ్, ఉక్రెయిన్ పర్యటనలకు బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విదేశీ పర్యటనకు బయల్దేరారు..పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు..గురు,,శుక్రవారాల్లో పొలాండ్‌లో ప్రధాని బస చేయనున్నారు..భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని ఈ పర్యటనకు వెళుతున్నారు..భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి..భారత్ కు కీలక ఆర్ధిక భాగస్వామిగా పోలాండ్ ఉంది.. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలాండ్ అధ్యక్షుడు, ప్రధానులతో మోడీ సమావేశం కాబోతున్నారు.. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.. రెండు రోజుల పోలాండ్ పర్యటన అనంతరం 23న మోడీ ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని అక్కడకు వెళ్లనున్నారు.. ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం గమనార్హం.