కేంద్ర నుంచి రాష్ట్రానికి నిధులు-కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లింపులు ?
అమరావతి: రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ (సాకీ) కింద కేంద్రం నుంచి తొలి విడతగా రూ.1500 కోట్లు నిధులు విడుదల అయినట్లు సమాచారం..దాదాపు 50 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిధులను రాష్ట్రాలకు సమకూరుస్తుంది..రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెరిగే విధంగా కేంద్రం ఈ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది..” SACI”పథకం కింద ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తొంది..ఈ పథకం కింద రూపొందించిన విధివిధానాల ప్రకారం రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదం తెలుపుతుంది.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ప్రత్యేకంగా నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించిక పోవడంతో,కాంట్రాక్టర్లు అమరావతిలో నిరహార దీక్షలు చేయడం,అటు తరువాత కోర్టులకు వెళ్లి నిధుల చెల్లింపులపై ఆర్డర్లు తెచ్చుకున్నారు.. అయినప్పటికి ఇంకా వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు వున్నాయి..దింతో కూటమి ప్రభుత్వం అభివృద్ది పనులు చేపట్టాలన్న కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితుల్లో లేరు..రాష్టంలో పనులు జరగాలంటే,కాంట్రాక్టర్లకు కొంత మేర అయిన బిల్లులు చెల్లించాల్సి వుంటుంది..ఈ విషయంను దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం పై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..