ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుకి భారీ ఉరట
అమరావతి: ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై YSRCP నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది..పిటిషన్లను జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని,,ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు..ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంటూ రెండు పిటిషన్లను తోసిపుచ్చింది.. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది..
విచారణ సందర్భంగా జరిగిన వాదనల్లో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను మందలించింది..ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టు టైమ్ ను వృథా చేయవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది.. పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా తీసింది..ఈ సందర్భంగా పిటిషనర్ 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.. కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తప్ప రాజకీయ కక్షల కోసం ధర్మాసనం వద్దకు రావొద్దంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట ఓ జాబితా పెట్టారు.. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు.. కేసుల జాబితా చూశాక పిటిషనర్ రామకృష్ణారెడ్డిపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనపడటం లేదని తెలిపింది.