CBI పరిధిలో నిర్ధేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి
అమరావతి: గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న వేల కోట్ల అవినితి,,ఆక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి దోషులను చట్ట పరంగా శిక్షించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతొంది..ఇందులో బాగంగా కొన్ని కేసుల్లో దర్యాప్తు పరిధి రాష్ట్ర స్థాయిలో సిఐడీ,ఏసిబీలకు వుండదు..అలాంటి సమయంలో సిబీఐకి అయితే ఇలాంటి పరిమితులు వుండవు..ఈ విషయంలను దృష్టిలో వుంచుకునే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందంటే,,త్వరలోనే బడాబాబుల భాగోతాలను బయట పెట్టనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి..
నేడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ గెజిట్‌ను విడుదల చేసింది.. సిబీఐ ఒక రాష్ట్రంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటే,,సదరు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరిగా కావాలి.. 2014-19 టీడీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం తనను సీబీఐ ద్వారా ఇబ్బందులు పెడుతుందని భావించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు,రాష్ట్రంలో సిబీఐ కేసులు నమోదు చేయడం,,దర్యాప్తు జరిపేందుకు అనుమతి నిరాకరిస్తూ గెజిట్ ను విడుదల చేశారు..ప్రస్తుతం కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ గెజిట్ 2024 జూలై-01 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది..ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946లోని సెక్షన్-03 ప్రకారం విచారణ పరిధి పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది..
సిబీఐ కోర్టుల అదేశాలతో ఏ రాష్ట్రంలో అయిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు..అలాటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేకుండా కేసులు నమోదు,దర్యాప్తు చేయవచ్చు.
(CBI can, in the following situations (i) The concerned State Government makes a request to that effect and the Central Government agrees to it (Central Government generally seeks comment of CBI before deciding upon the request of the State) (ii) The State Government issues notification of consent under section 6 of the DSPE Act and the Central Government issues notification under section 5 of the DSPE Act (iii) The Supreme Court or High Courts orders CBI to take up such investigations)