మరో వాయు గుండం-రాగల 12 గంటలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం?
అమరావతి: విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం రాగాల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలలో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండం:- విదర్భ,,తెలంగాణ ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోందని, ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది..తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 55 కిలోమీటర్లు వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..
విశాఖ వైపు వెళ్లె రైళ్లు రద్దు:- భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల రైలు పట్టాలపై నీళ్లు నిలిచాయి.. దీంతో మంగళవారం విశాఖపట్నం మీదగా నడిచే పలు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి..3,4 తేదీల్లో సికింద్రాబాద్-షాలిమార్- సికింద్రాబాద్ ఏసీ ఎక్స్ ప్రెస్ రాకపోకలు రద్దు అయ్యాయి..20707-20708 సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు రద్దు అయ్యాయి..207833-207834 విశాఖ-సికింద్రాబాద్-విశాఖ (వందే భారత్ ఎక్స్ ప్రెస్)రైలు కూడా రద్దు అయ్యాయి.