కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం అయిన విజయవాడ
ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు..
అమరావతి: కుంభవృష్టి వర్షాలతో విజయవాడ అతలాకుతలం అయింది..విజయవాడ నగరం దాదాపుగా వరద నీటిలో చిక్కుకుపోయింది..దాదాపు 2.5 లక్షల మంది వరద నీటి వల్ల నిరాశ్రుయులు అయినట్ల సమాచారం.. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి..కృష్ణా నదిలోకి భారీగా నీరు చేరుతుండడంతో భవానిపురం,,సింగ్ నగర్ కాలనీలో నీటిలో ముగినిపోయాయి.. ప్రకాశం బ్యారేజ్ ఎగువ వాటర్ పున్నమి ఘాట్ వద్ద రోడ్డు పైకి చేరుతోంది..సహాయ సిబ్బంది ఇసుక బస్తాలతో నీటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు..రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో గొల్లపూడిలోని సాయిపురం కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరెంటు, వాటర్ లేకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఖాళీచేసి వెళ్లిపోతున్నారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక:- కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కలుగా నమోదయింది..కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ చేరుకున్నాయి.. పంజాబ్(4), తమిళనాడు(3), ఒడిశా(3) రాష్ట్రాల నుంచి వచ్చాయి..మరో 4 చాపర్స్ కూడా విజయవాడ చేరుకున్నాయి..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ:- వరద ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందళోనకు గురికావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని కోరారు.
మంత్రి నారాయణ:- మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఉదయం నుంచీ వరుస పర్యటనలు చేస్తున్నారు.. రామలింగేశ్వర నగర్ లో రోడ్లపైకి కృష్ణా నది వరద చేరుతున్న ప్రాంతాలు పరిశీలించారు.. ఇళ్ల మధ్యకు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని VMC అధికారులకు ఆదేశించారు.,. భూపెష్ గుప్తా నగర్ లో ముంపు బారిన పడిన ప్రాంతాలను పరిశీలించి అనంతరం లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు.
గేట్లకు అడ్డుపడిన బోట్లు:- కృష్ణనది ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి..ఈ నాలుగు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది..నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువస్తున్నారు..మొత్తం 70 గేట్లను ఎత్తి 11.38 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 24.3 అడుగుల మేర కొనసాగుతోంది..వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.