విశ్వంలో రహస్యలను శోధించేందుకు కక్ష్యలోకి విజయవంతంగా చేరుకున్న “డాకింగ్” శాటిలైట్స్
అమరావతి: విశ్వంలో రహస్యలను శోధించేందుకు భవిష్యత్ లో భారత్ ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్ కు సంబంధించిన “డాకింగ్” శాటిలైట్స్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) విజయవంతంగా ప్రయోగించింది.. భారతీయులు ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న “స్పేడెక్స్” ప్రయోగాన్ని సోమవారం రాత్రి 10.02 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి PSLV C-60 రాకెట్, SDX-01 (ఛేజర్), SDX-02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టింది..ఇస్రో శాస్త్రవేత్తలు, “స్పేడెక్స్” ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు చేశారు..తొలుత అనుకున్నరాత్రి 9:58 గంటలకు బదులుగా 10:15కు ఈ ప్రయోగం చేపట్టారు..అంతరక్షంలో శాటిలైట్స్ ను “డాకింగ్” చేయగల సత్తా కలిగిన 4వ దేశంగా భారత్ అవతరించింది.