AP&TG

రేషన్‌ బియ్యం మాయం అయిన వ్యవహరంలో A6 గా పేర్ని.నానిపై కేసు నమోదు

అమరావతి: గొడౌన్ నుంచి రేషన్‌ బియ్యం మాయం అయిన వ్యవహారంలో వైసీపీ నేత,, మాజీ మంత్రి పేర్ని.నానిపై కేసు నమోదైంది.. అయనపై A6 గా బందరు తాలూకా పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు..తనపై కేసు నమోదు కావడంతో నాని పరారైనట్లు సమాచారం.. పీడీఎస్ బియ్యం ప్రక్కదారి పట్టిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నాలుగురు నిందితుల నుంచి సేకరించిన ఆధారాలతో పేర్ని.నాని పేరును పోలీసులు FIRలో జాబితాలో చేర్చారు.. బియ్యం మాయం అయిన వ్యవహారంలో మిల్లర్ల నుంచి లారీ డ్రైవర్‌కు,, లారీ డ్రైవర్‌ నుంచి నిందితులకు నగదు లావాదేవీలు జరిగినట్లు పోలీసులు,, ఫోన్‌ పే, ఆన్‌లైన్‌ బ్యాంకు లావాదేవీలను సేకరించారు.. పేర్ని నాని ఆదేశాల మేరకే నగదు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు..త్వరలోనే పోలీసులు పేర్ని నానిని అరెస్ట్‌ చేసే అవకాశముంది.

నలుగురు నిందితులకు 12 రోజుల రిమాండ్‌:-  ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. వారికి మచిలీపట్నంలోని స్పెషల్‌ మొబైల్‌ జడ్జి 12 రోజుల రిమాండ్‌ విధించారు..దీంతో నిందితులను మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు..ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధను ఏ1గా పోలీసులు పేర్కొన్నారు.. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది..అరెస్ట్ అయిన నలుగురు నిందితుల్లో గోదాము మేనేజర్‌ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి,, రైస్‌ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు,, లారీ డ్రైవర్‌ బోట్ల మంగరాజు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *