సనాతన ధర్మంను కించ పరిస్తే సహించేది లేదు-పవన్ కళ్యాణ్
అమరావతి: సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు,మధురైలో జరిగిన మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొన్నాడు..ఆదివారం హిందూ మున్నని సంస్థ ఆధ్వర్యంలో లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో మధురై జనసంద్రమైంది..ఈ సందర్బంలో పవన్ కళ్యాణ్ తమిళంలో,,కొంత సేపు తెలుగులో మాట్లాడారు..ఇతర మతాలను తాను గౌరవిస్తానని అయితే హిందు ధర్మంను కించపరిస్తే సహించేది లేదన్నారు..సెక్యూరిజం అంటే మతాలకు అతీతంగా వ్యవహరించాలని,, కొంత మంది సూడో సెక్యూరిస్టులు హిందు మతాన్ని,,హిందు దేవ,దేవతలను కించపరుస్తు మాట్లాడుతారని,,హిందు మతం గురించే మాట్లాడే నాయకులు,వ్యక్తులు,ఇస్లాం,క్రిస్టియన్ మతం గురించి మాట్లాడే ధైర్యం లేదన్నారు.. ఎందుకంటే,వాళ్ల మతం గురించి మాట్లాడితే వారు సహించరని,,అదే సమయంలో హిందు మతం గురించి నోరుపరేసుకుంటారని మండిపడ్డారు..అనంతరం ధర్మానికి విఘాతం కలిగిన ప్రతీసారి పవన్ కళ్యాణ్ వచ్చి ధర్మ పరిరక్షణ కోసం నిలబడతాడని వక్తులు అన్నారు.