హర్మోజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించిన ఇరాన్
అమరావతి: అమెరికా ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేయడంతో,,ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది..ఇందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది..ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మోజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది.. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు ప్రపంచదేశాల మద్దతును కూడగట్టేందుకే ఇరాన్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం సముద్ర రవాణా జరుగుతుంది..రోజు రెండు కోట్ల బారెళ్ల చమురు సౌదీ,,ఇరాన్,,యూఏఈ,,కువైట్,,ఇరాక్ నుంచి చమురు ఎగుమతి అవుతుంది..భారత్ చేసుకునే చమురు దిగుమతులకు కూడా హర్మోజ్ జలసంధి అత్యంత కీలకమైనది..90 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్ కు,,ఇందులో 40 శాతం హర్మోజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది.. ఇరాన్ జలసంధిని మూసివేయలని నిర్ణయం తీసుకోవడంతో, భారత్ తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది..ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువపైన కూడా ప్రభావం చూపిస్తుంది..ఇలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి మరి.?