నిరసన వ్యక్తం చేసిన వారు సంకరజాతి వాళ్లు! సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
అమరావతి: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. రాజధాని మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారని శిరీష ఫిర్యాదులో పేర్కొన్నారు..దీంతో 352,353(2), 196(1) సెక్షన్ల కింద సజ్జలపై కేసు నమోదు చేశారు.. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(జర్నలిస్ట్ కృష్ణంరాజు రాజధాని మహిళలపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేశారు..నిరసన వ్యక్తం చేసిన వారు సంకరజాతి వారని సజ్జల చేసిన వ్యాఖ్యలపై శిరీష ఫిర్యాదు చేశారు.. ఈ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు.. అయితే సజ్జలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని హైకోర్ట్ లో శిరీష తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటీషన్ వేశారు.)