AP&TGMOVIESOTHERS

ఆ నాలుగురిలో నేను లేను-దయచేసి నన్ను కలపవద్దు-అల్లు.ఆరవింద్

అమరావతి: జూన్ 1 నుంచి థియేట‌ర్ల బంద్ వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది..ఈ విషయంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే వ‌ర‌కు వ‌చ్చింది.. దీంతో డిప్యూటివ్ సీ.ఎం పేషి నుంచి తెలుగు సినీ ఇండ‌ప్ట్రీపై రిట‌ర్న్ గిఫ్ట్ అంటూ కంప్లైంట్ లెట‌ర్ మీడియాకు విడుద‌ల చేశారు..ఈ నేపధ్యంలో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఆదివారం సాయంత్రం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు..ఈ సంద‌ర్భంగా అర‌వింద్‌ మాట్లాడుతూ,, ఇటీవ‌ల త‌రుచూ వినిపిస్తోన్న ఆ న‌లుగురు అనే దాంట్లో నేను లేన‌ని న‌న్ను అందులో క‌ల‌పొద్ద‌ని కోరారు..15 సంవ‌త్స‌రాలుగా ఆ న‌లుగురు అనే ప‌దం మొదలు అయింద‌ని,,ఆ త‌రువాత అది 10 మందికి చేరుకుందని అయితే మళ్లీ ఇప్పుడు ఆ న‌లుగురు అంటూ వార్తలు రావ‌డం ఆశ్చర్యంగా ఉంద‌న్నారు..కోవిడ్ త‌రువాత నేను ఆ నాలుగురు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను,,న‌న్ను అందులో క‌ల‌పొద్ద‌న్నారు… రెండు తెలుగు రాష్ట్రాల‌లో 1500 థియేట‌ర్లు ఉండ‌గా అందులో నాకు 15 థియేట‌ర్ల లీజులు మాత్ర‌మే ఉన్నాయని,, అవి కూడా లీజ్ అయ్యాక క్లోజ్ చేసుకుంటాన‌ని,, ప్ర‌స్తుతం అవి నా వ‌ద్ద పని చేసే వారి చేతుల్లోనే ఉన్నాయ‌న్నారు..తెలంగాణ‌లో నాకు ఒక్క థియేట‌ర్ లీజు కూడా లేద‌ని,,ఉన్న ఒక్క థియేటర్ AAA నా సొంతది అని అన్నారు..ఇక‌ నుంచి ఆ న‌లుగురిలో న‌న్ను ఇన్వాల్ చేయ‌వ‌ద్దని, నా పేరు తేవ‌ద్దని కోరారు..

ఇటీవ‌ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ చేసిన వ్యాఖ్య‌లు 100 శాతం స‌మంజ‌సం అని ఆయ‌న మాట‌ల‌తో నేను ఏకీభ‌విస్తున్నా అని అన్నారు..ఇటీవ‌ల 3 సందర్బంలో జరిగిన థియేట‌ర్ల మీటింగ్‌కు నేను కావాల‌నే వెళ్లలేద‌ని,,మా గీతాఆర్డ్స్ డిస్ట్రీబ్యూట‌ర్స్‌ ను సైతం వెళ్ల నీయ‌లేద‌న్నారు..ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ముందు మాట్లాడుకోవాలి,, ఛాంబ‌ర్‌కు వెళ్లాలి అంతే కానీ ఎవ‌రికి వాళ్లు ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌డం తనకు న‌చ్చ‌లేద‌న్నారు..అదీ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో బంద్ అనేది దుస్సాహాసం చేసేందుకు ప్రయత్నించడం చూస్తూంటే,, ఆయ‌న‌నేమైనా బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు..సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం,, ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు మాట్లాడుతున్నారు..వారికి గత ప్రభుత్వంలో సీఎం జగన్ ను కొందరు సినీ పెద్దలు ఎందుకు కలిశారు?… ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ వ్యాపారం కూడా సాఫీగా జరగదు,,కష్టం వస్తే కానీ సీఎంను కలవమా..? ఒక పద్దతి లేదా..? అంటూ ప్రశ్నించారు.. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిన వ్య‌క్తి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి మ‌న సినిమా వాళ్ల‌కు అనేక ర‌కాల స‌హాయ సాకారాలు అందిస్తున్నార‌న్నారు..అశ్వినీద‌త్ సినిమా విష‌యంలో రేట్లు అడిగే స‌మ‌యం లోనే ఛాంబర్ తరపున సీఎం చంద్రబాబును కలవాలని పవన్ హింట్ ఇచ్చారు..పని అయిపోయిన త‌రువాత అంతా మ‌రిచిపోయార‌న్నారు..  ప‌వ‌న్ స్వ‌యంగా చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబును క‌ల‌వక‌పోవ‌డం త‌ప్పిద‌మే అన్నారు..థియేట‌ర్లకు స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నేది వాస్త‌వం,,ఈ విషయంపై అందరం కలసి కూర్చోని మాట్లాడుకుని,, పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *