ప్రముఖ సినీ నటుడు,మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం
హైదరాబాద్: తెలుగు సినీమా పరిశ్రమకు నాలుగు దశాబ్దాలకు పైగా చేస్తున్న సేవలకు అలాగే వ్యక్తిగతంగా చేసిన దాతృత్వానికి యూకే ప్రభుత్వం గుర్తించింది..ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెగాస్టార్ చిరంజీవికి మార్చి 19వ తేదిన జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేయనుంది..యూకే పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని సత్కరించనుంది..చిరంజీవి సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్,, 2024లో విద్మవిభూషన్ తో గౌరవించింది.. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చోటు దక్కించుకున్నారు..156 సినిమాలు… 537 పాటలు…24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది…