AP&TG

మువ్వన్నల జాతీయ జెండాను అందించిన పింగళి వెంకయ్యను జాతి మరువదు-పవన్

అమరావతి: భారత మువ్వన్నెల జెండా రూపకర్త, మన తెలుగుజాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య 148 జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఆ మహనీయునికి ఘన నివాళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్పించారు. పింగళి వెంకయ్య అందించిన స్ఫూర్తిని జాతి మరువదన్నారు. ఈ శుక్రవారం పింగళి వెంకయ్య జయంతి అని ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మన దేశానికి ఒక కేతనం ఉండాలనే తపనతో వెంకయ్య మువ్వన్నెలతో పతాకాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆదే జెండా నాడు, నేడు, ఎన్నడూ మన కీర్తి కేతనంగా ఎగురుతూనే ఉంటుందన్నారు. ఆ జెండాకు సెల్యూట్ చేసిన ప్రతిసారి పింగళి వెంకయ్య స్ఫురణకు వస్తూనే ఉంటారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *