తెలుగువారిని కించపర్చే వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి, పరారీ
అమరావతి: తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి..ఇంటికి తాళం వేసి కన్పించకుండా పోయింది..ఇటీవల నటి కస్తూరీ ఓ రాజకీయ సభలో మాట్లాడుతూ ‘తమిళనాడులో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చేవారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి..దింతో అమెపై మూడు రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో ఇదే విషయమై కేసులు నమోదయ్యాయి..ఈ విషయంపై ఆమెకు సమన్‌లు అందజేసేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులకు ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్ చేశారు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది..దాంతో నటి కస్తూరి పారిపోయారన్న ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుతం ఆమె ఎక్కడుందనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు.