బిల్డింగ్ నిర్మాణ అనుమతులు 5 అంతస్తుల వరకు లైసెన్స్ సర్వేయర్ల ద్వారా-మంత్రి నారాయణ
తేడాలు వస్తే లైసెన్స్ శాశ్వతంగా రద్దు..
నెల్లూరు: మున్సిపాలిటీల్లో బిల్డింగ్ పర్మిషన్లు, లేఔట్ అనుమతులు సింగిల్ విండో ద్వారా మంజూరు చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు,లైసెన్స్డ్ సర్వేయయర్లు,,బిల్డర్స్ తో సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో బిల్డింగ్ నిర్మాణ అనుమతులు 5 అంతస్తుల వరకు లైసెన్స్ సర్వేయర్ల ద్వారా చేయించుకోవచ్చుఅన్నారు. నెల్లూరు నగరంలో లైసెన్స్ సర్వేర్లతో,,బిల్డర్లతో సమావేశం నిర్వహించి అన్ని విషయాలు మాట్లాడటం జరిగిందన్నారు..
తేడాలు వస్తే లైసెన్స్ శాశ్వతంగా రద్దు:- రాష్ట్రంలో నూతన విధానంలో బిల్డింగ్ అనుమతులు లేఔట్ అనుమతులను సింగిల్ విండో విధానాన్ని డిసెంబర్ 31 లోగా వెబ్సైట్లో ఉంచుతామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీల్లో బిల్డింగ్ అనుమతులు లేఔట్ లో అనుమతుల కోసం ఇతర కార్యాల చుట్టూ తిరగనవసరం లేదని, మున్సిపల్ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్, రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన అనుమతులు పొందవచ్చునని ఆయన తెలియజేశారు. లైసెన్స్ సర్వేయర్లు మంజూరు చేసిన బిల్డింగ్ అనుమతుల నిర్మాణాలు తేడాలు వస్తే వారి లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెడతామని చెప్పారు.