ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-2026 విద్యాసంవత్సరానికి గాను వసతి గృహాలలో ఉత్తమ ఫలితాలు సాధించి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని, విద్యార్థులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అభినందిస్తూ శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన కావలి, ఉదయగిరి, పొదలకూరు పరిధిలోని విద్యార్థులైన ఏ. సంతోష్ (584), వి.వి. సూర్య ప్రణీత్ (574), సి హెచ్. వినీత (574), పి. ప్రవీణ్ కుమార్ (574), ఆకుల సంతోష్ (562), జే. నిరంజన్ (561), యం. సాయి శశాంక్ రెడ్డి (561), ట్. కార్తీక్ (558)లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయగా, విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన వసతి గృహ సంక్షేమ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.

