OTHERSWORLD

ఇరాన్ దాడుల‌ను తిప్పికొట్టేందుకు సిద్దం అవుతున్న ఇజ్రాయిల్,అమెరికాలు

అమరావతి: హ‌మాస్ మిలటరీ రాజ‌కీయ‌ వ్యవహరాల నాయకుడు ఇస్మాయిల్ హ‌నియా హ‌త్యకు ఇజ్రాయిల్ కారణం అంటూ ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడికి సిద్దం అవుతున్న‌ది..ఈ నేప‌థ్యంలో ఇజ్రాయిల్ కు మద్దతుగా తాము వుంటాము అంటూ అమెరికా అధ్యక్షడు జో బైడన్ ప్రకటించారు..దింతో మ‌ధ్య‌ప్రాశ్చ్య ప్రాంతంలో యుద్ధ నౌక‌ల‌ను అమెరికా సిద్దం చేస్తొంది..ఇరాన్ చేప‌ట్టే దాడుల‌ను తిప్పికొట్టేందుకు అమెరికా తగు ప్రణాళికలను సిద్దం చేసినట్లు అంతర్జాతీయ వార్త సంస్థలు పేర్కొంటున్నాయి..మిడిల్ ఈస్ట్‌ లో యుద్ధ‌నౌక‌లు,, ఫైట‌ర్ జెట్స్‌ ను అమెరికా మోహ‌రిస్తున్న‌ది.. ఇజ్రాయిల్‌ లో వున్న తమ సిబ్బందిని, ఇజ్రాయిల్‌ దేశంను కాపాడే దిశగా పెంటగాన్ ఈ చ‌ర్య‌ల‌కు దిగింది.. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ క్రూయిజ‌ర్లు, డెస్ట్రాయ‌ర్లను కూడా అమెరికా మోహ‌రిస్తున్న‌ట్లు పెంట‌గాన్ అధికారులు తెలిపారు.

భార‌తీయులు జాగ్రత్తగా వుండాలి.. టెల్ అవివ్‌లో ఉన్న ఇండియ‌న్ ఎంబ‌సీ శుక్ర‌వారం ఓ అడ్వైజ‌రీ రిలీజ్ చేసింది..భార‌తీయులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని,,సేఫ్టీ ప్రోటోకాల్స్‌ కు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది..ఎంబ‌సీకి చెందిన సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో అడ్వైజ‌రీ పోస్టు చేశారు.. ఇజ్రాయిల్‌, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న జారీ చేశారు..హ‌మాస్ నేత‌ల‌తో పాటు హిజ్‌బుల్లా క‌మాండ‌ర్స్ ను ఇజ్రాయిల్ చంపిన ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌తీయ ఎంబ‌సీ ఈ ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *