కేదార్‌నాథ్ లో క్టౌడ్ బరస్ట్ తో భారీ వర్షాలు-చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
బండి.సంజయ్ కు మెసేజ్ లు..
అమరావతి: కేదార్‌నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు..కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు అయ్యారు..కేదార్‌నాథ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండడంతో 16 వందల మంది యాత్రికులు చిక్కుకుపోయారు.. క్టౌడ్ బరస్ట్ తో భారీ వర్షాల కురవడంతో నడక మార్గం దెబ్బతిన్నది..గౌరీకుండ్-కేదార్‌నాథ్ మధ్య 13 చోట్ల మార్గం విధ్వంసమైంది..ఈ మార్గంలోచిక్కుకుపోయిన 3 వేల మంది భక్తులు ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. రంగలోకి దిగిన NDRF,SDRF, ఆర్మీ సహాయక బృందాలు కొండ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు శ్రామిస్తున్నారు.. గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో గాలిస్తున్న సహాయక బృందాలు.. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వస్తున్నాయి..కేదార్‌నాథ్ స్వర్గ రోహిణి కాటేజిలో పలువురు తెలుగు యాత్రికులు సహాయం కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు మెసేజ్ చేశారు.. ఆహారం,, నీరు దొరక్కపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నామని తమకు సహాయం అందించాల్సిందిగా కేంద్రమంత్రిని తెలుగు యాత్రికులు కోరారు.. వెంటనే స్పందించిన బండి సంజయ్,, ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగంతో మాట్లాడారు.. వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.