తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎల్. మురుగన్
తిరుమల: దేశ ప్రజలు ఆయు ఆరోగ్య, సంపదలతో విలసిల్లాలని, దేశ ప్రధాని వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారత దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి మురుగన్ చెప్పారు.ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర సహాయ మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీజీ ప్రభుత్వం రావడం ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టమని, కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడు నుంచి తనకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశ ప్రధాని వికసిత్ భారత్ సంకల్పం 2047 నెరవేరాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నాను అని పేర్కొన్నారు.