AP&TG

మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది…ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి SIPB నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు,,లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది..అలాగే మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మంత్రివర్గ సమావేశాంలో ఆమోదించారు..

కేబినెట్ నిర్ణయాలు:- రాష్ట్రంలో 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం..నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం..లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం..లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చ..పార్లమెంట్‌లో అనుసరించిన విధానం ఇక్కడ కూడా కొనసాగించాలని నిర్ణయం..కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్‌లో వచ్చిన ప్రతిపాదనలకు నిర్ణయం..ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయాలని నిర్ణయం..దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం..ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటుకు నిర్ణయం..కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌ లు పునరుద్ధరించాలని నిర్ణయం..అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం..కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు..స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,,లోకల్‌గా వున్న సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహకాలను పవన్ ప్రస్తావించారు..అలాగే కల్చరల్ హెరిటేజ్ టెక్స్‌ టైల్ టూరిజంతో పాటు సేఫ్టీ పాలసీపైన కూడా కేబినేట్‌లో సూచనలు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *