పామాయిల్ ప్యాకెట్ ను 110/-లకే వినియోగదారులకు అందించాలి-జె.సి కార్తీక్
నెల్లూరు: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కేంద్రాల్లో, రైతు బజార్లలో పామాయిల్ ప్యాకెట్ ను 110/-లకే వినియోగదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ జె.సి మాట్లాడుతూ పారదర్శకత కోసం ఈ ధరలను సూచించే స్పష్టమైన బోర్డు ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు పామాయిల్ అమ్మకపొతే, అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా రైతు బజార్లలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో 35 రూపాయలకే అందిస్తున్నామన్నారు. అలాగే ధరల నియంత్రణ సెల్ ను కొత్తగా ఏర్పాటు చేసామని, ప్రతిరోజూ ఒక హోల్ సేల్, ముగ్గురు రిటైల్ వ్యాపారస్తుల నుండి ధరల వివరాలు సేకరించి నివేదిక పంపాలన్నారు.ఈ సమావేశంలో DSO వెంకటరమణ,మార్కెటింగ్ శాఖ AD అనిత, పౌరసరఫరాల D.M నరసింహారావు, ఆయిల్ వ్యాపారస్తులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.