అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.. సభలో స్పీకర్ మాట్లాడుతూ, ఈ సమావేశాలు మొత్తం 10 రోజులు జరిగాయన్నారు.. 59 గంటల 55 నిముషాలు సమావేశం జరిగాయని ఆయన తెలిపారు..ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టిగా, ఆమోదించినట్లు వివరించారు.. ఈ సభలో సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారన్నారని వెల్లడించారు..
కీలక బిల్లులు:- లోకాయుక్త సవరణ బిల్లు,,ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్లు,,మునిసిపల్ లా బిల్లు,, వస్తు, సేవల సవరణ బిల్లు,,విలువ ఆధారిత పన్ను బిల్లు,,ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లు(ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లులో ఇసుక అక్రమ రవాణా, బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు తరలింపునకు అడ్డుకట్ట వేయడాన్ని పొందుపరుస్తూ హోంమంత్రి అనిత ప్రతిపాదించారు),,హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు,,మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.