భారత్ కు రండి,సునీతా విలియమ్స్ కు లేఖ రాసిన ప్రధాని మోదీ
అమరావతి: సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడం కోసం ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తుండగా, భారతసంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చి 1వ తేదినే లేఖ లేఖ రాశారు..భారత ప్రజల తరఫున సునీతా విలియమ్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు..ఈ రోజు ఓ కార్యక్రమంలో తాను మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోను కలవడం జరిగిందని,,తమ మధ్య జరిగిన సంభాషణలో సునీతా విలియమ్స్ పేరు ప్రస్తావనకు వచ్చిందన్నారు..సునీతా విలియమ్స్ విధి నిర్వహణలో చూపుతున్న నిబద్ధత పట్ల ఎంతో గర్వపడుతున్నామని పరస్పరం చెప్పుకున్నామని అన్నారు..తాను అమెరికా పర్యటనలు చేస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్‌ను కలిసినప్పుడు సునీతా విలియమ్స్ యోగక్షేమాల గురించి ఆరా తీశానని తెలిపారు.. 1.4 బిలియన్ల భారతీయులు సునీతా విలియమ్స్ విజయాల పట్ల ఎంతో గర్వపడుతున్నారని వెల్లడించారు.. అంతరిక్ష కేంద్రంలో కొంతకాలం నుంచి చోటుచేసుకున్న పరిణామాలు సునీతా విలియమ్స్ స్ఫూర్తిదాయకమైన,,ధైర్యవంతమైన,, పట్టుదలతో కూడిన వైఖరిని మరోసారి స్పష్టం చేశాయని తెలిపారు..సునీతా విలియమ్స్ వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ,, ఆమె ప్రజల హృదయాలకు దగ్గరగా ఉన్నారన్నారు..సునీతా విలియమ్స్ ఆరోగ్యం కోసం, ఆమె మిషన్‌లో విజయం సాధించడం కోసం భారత ప్రజలు ప్రార్థిస్తున్నారని చెప్పారు. బోనీ పాండ్యా (సునీతా విలియమ్స్ తల్లి) సునీతా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు..దివంగత దీపక్ భాయ్ (సునీతా తండ్రి) ఆశీస్సులు సునీతా విలియమ్స్ తో ఎప్పటికీ ఉంటాయని అన్నారు..2016లో తాను అమెరికా పర్యటన సందర్భంగా సునీతా విలియమ్స్ ను కలికున్నట్లు తనకు గుర్తుందని తెలిపారు..సునీతా విలియమ్స్ అమెరికాకు చేరుకున్న తరువాత భారత్‌కు రావాలని,, ఆమెను చూడటానికి ఇక్కడి వారంతా ఎదురు చూస్తున్నారని అలాగే మైఖేల్ విలియమ్స్ (సునీత భర్త)కు తన హృదయపూర్వక శుభాకాంక్షలని మోదీ పేర్కొన్నారు..బుచ్ విల్మోర్ కూడా క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.