అట్టహసంగా IPL 2025 ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం
అమరావతి: ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం అయ్యి మే 25వ తేదిన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.. మార్చి 22వ తేదిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి మ్యాచ్ అడనున్నది..ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ నిర్వాహకులు ప్రారంభ వేడుకను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు..శ్రద్ధా కపూర్,,వరుణ్ ధావన్ ఓపెనింగ్ వేడుకలో డ్యాన్స్ ప్రొగ్రాం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం..వీరితో పాటు పాపులర్ సింగర్ అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్, పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా తమ పాటలతో యూత్‌ను మైమరపింపజేస్తారని చెబుతున్నారు..మరి కొందరు బాలీవుడ్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి..ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు అనేక ఇతర కార్యక్రమాలు కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది..ఈ సీజన్‌లో ప్రతి జట్టు ఎలాగైన టైటిల్ విజేతే కావాలని పట్లుదలతో ప్రాక్టీస్ చేస్తున్నాయి.