అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభంమైన సునీతా,బుచ్ ల తిరుగు ప్రయాణం
అమరావతి: తొమ్మిది నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్-బుచ్ విల్మోర్ మంగళవారం తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు..నాసా తెలిపిన వివరాల ప్రకారం, విలియమ్స్-విల్మోర్ IST ఉదయం 10:35 గంటలకు ISS నుంచి బయటకు వెళ్లి భూమికి తిరిగి 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించారు.. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ కు చెందిన డ్రాగన్ అనే అంతరిక్ష నౌక బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం తీరంలోని సముద్ర జలాల్లోకి చేరుకుంటుంది.. గత ఏడాది జూన్‌లో ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వెళ్లారు.. వ్యోమగాములను అక్కడి సహాయ బృందాలు బయటకు తీసుకువస్తాయి.అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక విడిపోయే ప్రక్రియ ముగియడంతో నాసా ప్రత్యక్ష ప్రసారం ఆపేసింది. ప్రస్తుతం ఆడియో ద్వారా మాత్రమే వివరాలు తెలుపుతోంది. బుధవారం తెల్లవారుజాము 2.15 గంటలకు మళ్లీ లైవ్ ప్రారంభం కావచ్చు.