అవనిపైన అడుగు పెట్టిన సునీతా విలియమ్స్,బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు
అమరావతి: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 288 రోజుల తరువాత ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బుధవారం వేకుజామున 3.27 గంటలకు భూమిపైకి చేరుకున్నారు.. స్పేస్‌ఎక్స్ కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ లో సునీతా విలియమ్స్,, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు భూమిపైకి తిరిగి వచ్చారు..ఈ వ్యోమనౌక దాదాపు 17 గంటలు ప్రయాణించిన తరువాత ఫ్లోరిడా సముద్ర తీరప్రాంతంలో దిగింది.. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వ్యోమగాములను తరలించారు.. వీరిద్దరికి తక్షణమే వైద్య పరీక్షలను నిర్వహిస్తారు..భూ వాతావరణానికి అలవాటు పడేంతవరకు వారికి తగిన చికిత్స అందించనున్నారు..
ఈ సందర్బంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మెన్ నారాయణన్ స్పందిస్తూ, సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్ కు ఆయన స్వాగతం పలికారు.. అంతరిక్ష పరిశోధనల్లో సునీతా విలియమ్స్ అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు.. మీ దీక్ష,,పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.. ఇస్రో చైర్మెన్‌గా, భారత అంతరిక్ష శాఖ అధిపతిగా శుభకాంక్షలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోందని,,అంతరక్షంలో ఎదురైయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలి అనే మీ అనుభవాలను ఇస్రో స్పేస్ కార్యక్రమాలకు వాడుకోవాలని ఆశిస్తున్నామని ఇస్రో చైర్మెన్ తెలిపారు.