“Thank You For Thinking Of Me” అని రతన్ టాటా…..
అమరావతి: భారతదేశ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేర్పించారు.. వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు..రతన్ టాటా మృతిపట్ల రాష్ట్రపతి,,ప్రధాని,,హోం మంత్రితో పాటు దేశంలో అన్ని వర్గాల ప్రజలు,నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు..తన ఆరోగ్యంపై వస్తూన్న కథనలకు రతన్ టాటా స్పందిస్తూ,,తాను క్షేమంగానే ఉన్నానంటూ వివరణ ఇచ్చారు.. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి.. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను క్షేమంగానే ఉన్నాను.. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు (Thank You For Thinking Of Me)’ అని రతన్ టాటా పేర్కొన్నారు.. సరిగ్గా ఈ ట్వీట్ పెట్టిన మూడు రోజుల తర్వాత తుదిశ్వాస విడవడం అందరిని కలచివేస్తోంది..రతన్ టాటా చివరి పోస్ట్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.