3వ అంతస్థు నుంచి క్రిందకు దూకిన ఎమ్మేల్యేలు
అమరావతి: మహారాష్ట్ర సచివాలయం ‘(మంత్రాలయం) లో శుక్రవారం మధ్యహ్నం 1 గంట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది..సచివాలం మూడో అంతస్తు నుంచి అధికార కూటమికి చెందిన NCP ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా పలువురు గిరిజన MLAలు కిందకు దూకారు..ఇలాంటి ఆవాచనీయమైన ఘటనలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సేఫ్టీ వలలో వారు పడిపోయారు..పోలీసులు వారిని సురక్షితంగా క్రిందకు తీసుకుని వచ్చారు.. డిప్యూటీ స్పీకర్ తో పాటు BJP MP హేమంత్ సవ్రా, MLAలు కిరణ్ లహమతే, హిరిమాన్ ఖోస్కర్, రాజేష్ పటేల్ కూడా సేఫ్టీ నెట్‌లపై దూకిన వారిలో ఉన్నారు..పోలీసులు వారిని క్రింద తీసుకుని వచ్చిన తరువాత వారు తమ నిరసనను సచివాలయం ఆవరణలో కొనసాగించారు..
కారణం:- పంచాయతీల (ఎక్స్ టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్-PESA) చట్టం 1996 కింద గిరిజనులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని గిరిజన ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు..PESAలో రాష్ట్ర స్థాయిలో అక్టోబర్ 2023 నుంచి 17 వివిధ కేటగిరీల్లో గిరిజనుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిలిపి వేశారని మిడియాకు తెలిపారు.. ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతోనే తాము మంత్రాలయ నుంచి కిందకు దూకాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు..సమస్యను పరిష్కరించేందుకు గిరిజన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే శుక్రవారం సాయంత్రం సమావేశం కానున్నట్లు తెలుస్తొంది.