చత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్
అమరావతి: ఛత్తీస్‌గఢ్ లోని నారాయణ్‌పుర్-దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు..చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వనీయమైన సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు..ఇందులో బాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు..దీంతో మధ్యాహ్న సమయంలో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి..ఇరువైపుల నుంచి తూటాల వర్షం కురిపిస్తూ భీకరంగా పోరాడుతున్నాయి..ఎదురు కాల్పుల్లో 7 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఘటనా స్థలంలో గుర్తించడం జరిగిందని భద్రతా దళాలు తెలిపాయి..మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు వెల్లడించారు.