మమతా బెనర్జీ తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలి-‘నిర్భయ’ తల్లి ఆశా దేవి
అమరావతి: ఫిబ్రవరి-2024వ తేదిన,,తమపై కొంతకాలంగా టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ ఆత్యాచారంకు పాల్పపడినట్లు సందేష్ ఖాలీలో మహిళలు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానలకు నిరసనగా రోడ్లపైకి వచ్చారు..అప్పుడు కూడా కోర్టుల జ్యోకంతోనే అతనిని పోలీసులు ఆరెస్ట్ చేశారు…పశ్చిమబెంగాల్ లో మహిళపై ఆత్యంత క్రూరంగా ఆత్యాచారలకు పాల్పడిన వారిని కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కన్పిస్తుందని దేశవ్యాప్తంగా మహిళల నుంచి తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో….జూనియర్ డాక్టర్ పాశవిక అత్యాచారం, హత్య కేసుపై 2012 ఢిల్లీ బస్సులో గ్యాంగ్ రేప్ కు గురి అయిన బాధితురాలు ‘నిర్భయ’ తల్లి ఆశా దేవి తీవ్రంగా స్పందించారు..
జూనియర్ డాక్టర్ పాశవిక అత్యాచారం, హత్య కేసును సమర్ధవంతంగా పరిష్కరించడం, చర్యలు తీసుకోవడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని, ఆమె తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..మహిళ ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగినప్పడు,,అమె తనకు ఉన్న అధికారలతో తక్షణ చర్యలు తీసుకోవడానికి బదులుగా నిరసనల పేరుతో ప్రజల దృష్టి మరలిచేందుకు మమత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు..
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలు ఆగస్టు 9వ తేదిన అత్యంత దారుణంగా ఆత్యాచారం తరువాత హత్యకు గురైనట్టు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది..ఈ సంఘటనపై మెడికల్ కాలేజీ విద్యార్థినులు, డాక్టర్లతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు.. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
కేసును తప్పుదారి పట్టించేందుకు,, ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగిన మరుసటి రోజే ఈ నేరంతో సంబంధం ఉందంటూ ఒక వ్యక్తిని బెంగాల్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు..కేసు విచారణలో పోలీసులు వ్యవహరించిన పద్దతులను,, లోపాలని కోల్‌కతా హైకోర్టు తప్పుపడుతూ కేసును సీబీఐకి అప్పగించింది.