స్వర్ణభారత్ ట్రస్ట్ 23 ఏళ్ళ సేవా ప్రస్థానం అంకెలు కాదు, స్ఫూర్తిదాయక గమనం-ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్
నెల్లూరు: స్వర్ణభారత్ ట్రస్ట్ 23 ఏళ్ళ ప్రస్థానం అంటే అంకెలు కాదని, స్పూర్తిదాయక గమనమని, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు.. 23వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వెంకయ్యనాయుడు ఆలోచనలు మహోన్నతమైనవని పేర్కొన్నారు. వారి హృదయం ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో మమేకమై ఉందని, దానికి వారి మానసపుత్రికగా ఈ ట్రస్ట్ ఓ ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవం అందరి పండుగ అని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు నవీన పద్ధతులను అందిపుచ్చుకుని సాధికారతతో తల ఎత్తుకుని నిలబడటం తమ కలగా అభివర్ణించిన ఆయన, మహిళలు సైతం అదే సాధికారతతో తల ఎత్తుకు నిలబడాలని ఆకాంక్షించారు..
తిరుపతి నుంచి చాపర్ లో నెల్లూరుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు మంత్రులు నారాయణ,ఆనం,, ఎం.పీలు ఘనంగా స్వాగతం పలికారు.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దులు నజీర్ దంపతులు, ఎం.పిలు,ఎమ్మేల్యేలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.