HEALTHNATIONALOTHERS

దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ డేకేర్ సెంటర్లు-ప్రధాని మోదీ

అమరావతి: కేన్సర్ మందులను తక్కవ ధరకు అందుబాటులో ఉంచేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ డేకేర్ సెంటర్లు ప్రారంభించాలని కేంద్ర నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు..అదివారం మధ్యప్రదేశ్‌లోని చతర్పూర్‌లో బాగేశ్వర్ థామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్ట్ ఇన్‌స్టి్ట్యూట్‌కు ప్రధాని శంకస్థాపన చేశారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ,,కేన్సర్‌తో పోరాడేందుకు 2025-26 బడ్జెట్‌లో పలు ప్రకటనలు చేశామని గుర్తుచేశారు.. రాబోయే మూడు సంవత్సరాల్లో దేశంలోని అన్ని జిల్లాల్లోనే కేన్సర్ డేకేర్ సెంటర్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.. భాగేశ్వర్ థామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక వార్డుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ పేరు పెట్టనున్నట్టు ధీరేంద్ర శాస్త్రి ప్రకటించారు.. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో 3 సంవత్సరాల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు..10 ఎకరాల విస్తీర్ణంలో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించనున్నామని, మొదటి దశలో 100 పడకల సౌకర్యాన్ని సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు..నిస్సహాయులు,, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కేన్సర్ పేషెంట్లకు ఉచితంగా ఇక్కడ వైద్య సేవలను అందిస్తామని వెల్లడించారు..

ప్రధాని తన ప్రసంగంలో మహాకుంభ్‌ను విజయవంతం చేసేందుకు పారిశుధ్య కార్మికులు, పోలీసులు సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రశంసించారు. ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ‘గ్రేట్‌కుంభ్’ అని అన్నారు..వేలాదిమంది వైద్యులు,,వలంటీర్లు అకింతభావంతో,, కేవల సేవాభావంతో పనిచేశారన్నారు.. దేశంలోని మత,, సాంస్కృతిక సంప్రదాయాలను విమర్శిస్తున్న వారిపై ప్రధాని నిశిత విమర్శలు చేశారు..కొంత మంది నాయకులు హిందు మతాన్ని పరిహసిస్తూ,, ప్రజలను విడగొడుతూ,, తరచు దేశాన్ని,, విశ్వాసాలను బలహీనపరిచే విదేశీ శక్తులకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు..శతాబ్దాలుగా హిందూయిజాన్ని వ్యతిరేకించే వారు మన నమ్మకాలు,, ఆలయాలు,, సంస్కృతి,, సంప్రదాయాలపై దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు.. దేశంలో ఐక్యతా మంత్రాన్ని జాగృతం చేసేందుకు ధీరేంద్ర శాస్త్రి విశేష కృషి చేశారని, ఆయన చొరవతో ఇప్పుడు కేన్సర్ ఇన్‌స్టి్ట్యూట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *