బడ్జెట్ సమావేశాలు హాజరు కానున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్
ఏ గేట్ నుంచి వస్తారు?
అమరావతి: రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2025-26) సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి..మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు..అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది.. సభ వాయిదా పడిన తరువాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి..? ఏ రోజు ఏ అంశంపై చర్చించాలి..? అనే ఎజెండాను ఖరారు చేస్తారు..
రాజ్యాంగంలోని నిబంధన:- 101లో క్లాజ్ 4 ఏం చెబుతుందంటే,, ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకపోతే ఆ సభ్యుడిని డిస్‌క్వాలిఫై చేసే అధికారం సభాపతికు ఉంటుంది.. స్పీకర్ ఆనర్హుడిగా డిక్లేర్ చేసిన తరువాత ఎన్నికల కమిషన్‌కు నోట్ పంపితే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అవుతారు.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 4లో ఉంది..
శాసనసభ్యత్వంపై వేటు:- ఏ సభ్యుడైనా 60 పనిదినాలు సభకు రాకపోతే అతని శాసనసభ్యత్వంపై వేటు వేసేందుకు అసెంబ్లీ స్పీకర్ సిద్దం అవుతున్నట్లు సమాచారం..దింతో ఎమ్మేల్యేగా కూటమి ప్రభుత్వంపై పులివేందుల ఎమ్మేల్యేగా ఆరోపణలు చేసే అవకాశం పోతుంది..అంతే కాకుండా ప్రజల నుంచి కనీస సానుభూతి కూడా కోల్పోవాల్సి వస్తుంది..పరిస్థితులను అంచనా వేసుకున్నజగన్,, తన ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది.. అయితే ఆయన కేవలం అటెండెంట్స్ కోసం మొక్కుబడిగా వెళతారా? ఒక రోజు సమావేశాలకు హాజరు అయితే మళ్లీ 60 రోజుల వరకు వెళ్లనవసరం లేదు..ఈ క్రమంలో ఒక రోజు వెళ్లి “మమ” అన్పిస్తారా ? లేదా ప్రజల కోసం సభలో మాట్లాడదామని నిర్ణయించుకున్నారా? అనేది తేలాల్సి వుంది..
ప్రోటోకాల్ ప్రకారం:- సమావేశాలకు హాజరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు అందరికీ ప్రోటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచి లోపలకు వచ్చే అవకాశం ఉంటుంది..గేట్ నెం.1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సభాపతి, డిప్యూటీ స్పీకర్ తదితరులు, అలాగే ప్రతిపక్ష నేత కూడా వస్తారు..అయితే జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు.. అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుపట్టారు.. గేట్ నెం.2 నుంచి మంత్రులు వస్తారు.. గేట్ నెం.4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలకు రావాలి..మరి జగన్ నడుచుకుంటూ లోపలకు వెళతారా? లేదా స్పీకర్ కు ఉన్న అధికారం ఉపయోగించి జగన్‌కు గేట్ నెం.1 నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందా..? చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అనే సామెత ఇక్కడ వర్తిస్తుందా ??