రోమ్ కాథలిక్ చర్చి మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి విషమం
అమరావతి: రోమ్ కాథలిక్ చర్చి మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. గత వారం ఆయనకు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తలెత్తడంతో,, రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఆయనకు వైద్యులు రక్తమార్పిడి చేసి,,హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఫిబ్రవరి 14 న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన పోప్ గత 9 రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు.. ప్రస్తుతం పోప్ ఆరోగ్యం విషమంగానే ఉందని వాటికన్ శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది..వాటికన్ మాత్రం పోప్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని,,ఆయన ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదని ప్రకటించింది.