గ్రూప్-2 పరీక్షలు అదివారం యథాతథంగా జరుగుతాయి-కలెక్టర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రేపు జరుగునున్న గ్రూప్-2 పరీక్షలు అదివారం (ఫిబ్రవరి 23వ తేదిన) యథాతథంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది..ఇటీవల పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు వచ్చిన వార్తలపై (APPSC) స్పష్టత ఇచ్చింది..కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం,, MLC కోడ్ అమలులో ఉన్నందున గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలను తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది..ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది..గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని,,పరీక్షా కేంద్రాలు, సమయాలు, ఇతర వివరాలను అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లలో చూసుకోవాలని కమిషన్ పేర్కొంది..
ఆదివారం జరిగే గ్రూప్ -2 మెయిన్ పరీక్షలు యధాతధంగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ ఒ .ఆనంద్ తెలిపారు.
రేపు ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1 పరీక్షమధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్ – 2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు.
అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని, గ్రూప్ – 2 మెయిన్స్ వాయిదా అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని,అలా సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారం ఎవరు నమ్మవద్దనీ తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు కలెక్టర్ హెచ్చరించారు.