3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా
అమరావతి: ఉక్రెయిన్‌లో యుద్ధానికి తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.. 3 రోజులపాటు కాల్పుల విరమణను ప్రకటించింది.. మే నెల 8 నుంచి 10 వరకు కాల్పులు విరమణ అమల్లో ఉంటుందని క్రెమ్లిన్ వెల్లడించింది..రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా నిర్వహించే విక్టరీ డే వేడుకలు ఆయా తేదిల్లోనే జరగనున్నాయి..మే 8 ఉదయం నుంచి మే 11 వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని క్రెమ్లిన్ తెలిపింది..మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.. ఇందుకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా స్పందిస్తూ “కనీసం 30 రోజులు” పాటు కాల్పుల విరమణ ఇవ్వాలని కోరారు..రెండు వైపుల మధ్య సంధిని కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, శాశ్వత కాల్పుల విరమణను చూడాలనుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది..