త్వరలోనే నెల్లూరుకి విమానాశ్రయం-రైస్‌మిల్స్ ను ఇతర ప్రాంతాలకు మారుస్తాం-మంత్రి నారాయణ
మిల్లర్ల యజమానులు సహకరించాలి..
అమరావతి: నెల్లూరుకి విమానాశ్రయం ఎంతో అవసరమని,,త్వరలోనే విమానాశ్రయ పనులను ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ చెప్పారు..అదివారం కలెక్టరేట్‌లో మంత్రి నారాయణ మాట్లాడారు..ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ, రైస్ మిల్స్ ఎక్కువగా కార్పొరేషన్ ఏరియాలో ఉన్నాయన్నారు..రైస్ మిల్స్ ఉన్న ఏరియాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ఉందన్నారన్నారు… ఈ క్రమంలో ఎన్జీటీ నిబంధనల మేరకు…ఆ రైస్ మిల్లును ఆ ప్రాంతాల నుంచి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..ఇన్‌ఫ్రా స్టక్చర్ అంటే రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన మార్గం, ఓడరేవు ఈ నాలుగు చాలా ఇంపార్ట్ టెంట్ అన్నారు., నెల్లూరుకి విమాన మార్గం కావాల్సిన అవసరం చాలా ఉందన్నారు..వీలైనంత త్వరలోనే నెల్లూరుకి విమానాశ్రయ వర్క్ లను టేకప్ చేయడం జరుగుతుందన్నారు..