డిజటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ చేయండి-ప్రధాని మోదీ
అమరావతి: డిజిటల్ అరెస్టు అనేది చట్టంలో లేదని, ఇదొక మోసమని, సైబర్ నేరస్తులు చేసే పని అని ప్రధాన నరేంద్ర మోదీ వివరించారు.. ‘మన్ కీ బాత్’ 115వ ఎపిసోడ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ఆదివారం ప్రసంగించిన ప్రధాని, దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు..
డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,, ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ విచారణ చేపట్టదని ప్రధాని స్పష్టం చేశారు..’డిజిటల్ అరెస్టు మోసాల కింద సెల్ ఫోన్ ద్వారా తమను తాము పోలీసులుగా, సీబీఐ, ఆర్‌బీఐ, నార్కోటిక్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటున్నరని,,వీరు చాలా నమ్మకంగా మాట్లాడతారని తెలిపారు..ఈ విషయం గురించి ‘మన్ కీ బాత్’లో మాట్లాడమని ప్రజలు నన్ను కోరారని చెప్పారు..
డిజిటల్ అరెస్టు బాధితుల్లో అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఉన్నారన్నారు.. కష్టపడి సంపాదించుకున్న లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారని,,మీకు కనుక ఇలాంటి కాల్ ఏదైనా వస్తే అస్సలు భయపడవద్దని తెలిపారు..ఏ దర్యాప్తు సంస్థ కానీ ఇలాటి ఫోన్, వీడియో కాల్స్ చేయదు” అని ప్రధాని మోదీ తెలిపారు..
డిజటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు దర్యాప్తు సంస్థలు వేలాది వీడియో కాలింగ్ ఐడీలను, లక్షల్లో సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు చెప్పారు.. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ కోరారు.