హర్యానా ముఖ్యమొత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయబ్ సింగ్ సైనీ
అమరావతి: హర్యానా ముఖ్యమొత్రిగా నాయబ్ సింగ్ సైనీని బీజేపీ శాసనసభా పక్షం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకొవడంతొ గురువారం 2వ సారి హరియాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. నయాబ్ సింగ్ సైనీ చేత గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు..మంత్రులుగా అనిల్ విజ్, కృష్ణ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయల్, అరవింద్ కుమార్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ గాంగ్యా, కృష్ణ కుమార్ బేడీతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు..ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. .వీరికితోడు దేశంలోని పలు రాష్ట్రాకు చెందిన బీజేపీ ముఖ్యనేతలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.