11 సీట్లతో ప్రతిపక్ష హోదా కావలంటే జగన్ జర్మనీకి పోవాల్సిందే-డిప్యూటివ్ సీ.ఎం
భారతదేశంలో వీలుకాదు..
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ.. కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సభలో వైసీపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు.. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు.. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు..ఓట్లు శాతం గురించి మాట్లాడే వైసీపీ నాయకులు జర్మనీకి వెళ్లిపోవచ్చు.. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు అని స్పష్టం చేశారు.