ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్
అమరావతి: సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య కారణాలతో 30వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.. చికిత్స అనంతరం గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు..సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు..రక్తనాళాల వాపు వచ్చిందని,, దాన్ని సరిచేయడానికి స్టెంట్ అమర్చారని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వున్నరన్న వార్తలతో అందరిలోను టెన్షన్ పెరిగింది.. రజనీకాంత్ పరిస్థితిపై అపోలో ఆస్పత్రి నివేదిక విడుదల చేసింది..అందులో అతను గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని,,దీనిని సరిదిద్దాడనికి అపోలో ఆసుపత్రి నాన్ సర్జికల్ ట్రాన్స్ కాథెటర్ పద్ధతిలో చికిత్స చేసి, స్టెంట్ ను ఏర్పాటు చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు..అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి..రజినీకాంత్ వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారని తెలుస్తోంది.