DISTRICTS

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితాన్ని ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలి-జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌

మా అమ్మ కూడా టీచర్‌…

నెల్లూరు: ఉపాధ్యాయులు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌  పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురు పూజోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత గురుస్థానం ఉపాధ్యాయులకు ఇస్తారన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి మార్గం చూపి ఉన్నత స్థాయికి వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్నారు. కేరళ రాష్ట్రంలో చిన్న గ్రామంలో చదువుకున్నానని, తన తల్లి ఉపాధ్యాయురాలు అని పాఠశాలలోని ఉపాధ్యాయుల సూచన మేరకు IAS సాధించానని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాథమికంగా 60 జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో నెల్లూరు జిల్లాను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసే దిశలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గురుపూజోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *