శరవేగంగా పారిశుధ్యం పనులు జరుగుతున్నాయి-మంత్రి నారాయణ
అమరావతి: విజయవాడలో నగరంలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..54 వ డివిజన్ లో చెత్త తొలగింపు,ఫైర్ ఇంజన్ లతో క్లీనింగ్ చేస్తున్న ప్రాంతాలు పరిశీలించిన అనంతరం వరద బాధితుల ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి మంత్రులు పొంగూరు నారాయణ,సవిత తెలుసుకున్నారు..ఈ సందర్బంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకూ 80 శాతం వరద నీరు తగ్గిందని,,వరద బాధితులందరికీ సరిపడా ఆహారం,తాగునీరు, పాలు,బిస్కట్లు,పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు..వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు..బుధవారం ఒక్కరోజే బాధితులకు 26 లక్షల వాటర్ బాటిల్స్,10 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 8లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు.. వదరల అనంతరం అంటు వ్యాధుల సమస్యలు తలెత్తకుండా,,పారిశుధ్యం పనులు శరవేగంగా జరుగుతున్నాయని,,మొత్తం 10 వేల మంది పారిశుధ్య కార్మికులు చెత్త తొలగింపు,బ్లీచింగ్ చల్లే పనుల్లో ఉన్నారని,,అత్యాధునిక యంత్రాలు ఉపయోగించి చెత్తను త్వరితగతిన తొలగించేలా ఏర్పాట్లు చేశామన్నారు.