మన్యం వీరుడి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావి తరాలకు అందించాలి-పవన్ కళ్యాణ్
అమరావతి: దాస్య శృంఖలాలతో స్వేచ్ఛకు దూరమైన సమాజంలో పోరాట జ్వాలలు రగిలించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఉప ముఖ్యమంమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు..ఆ వీరుడి 128వ జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను.. మన్యం ప్రజల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగిన అల్లూరి పోరాట పంథా చిరస్మరణీయం.. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. ఆయనలోని పోరాట స్ఫూర్తిని, అణగారిన వర్గాలకు అండగా నిలిచే తత్వాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అభిలాషించారు.
టీటీడీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు…
తిరుపతి:- జూలై 04న అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు ఈ వేడుకలను టిటిడి వెల్పేర్ డిపార్ట్మెంట్ నిర్వహించనుంది.ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం, ప్రార్థన, పూజ, జ్యోతి ప్రజ్వలన, వక్తల ఉపన్యాసం, అతిథులకు సన్మానం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఏర్పాట్లను టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సంక్షేమం) ఎ.ఆనందబాబు పర్యవేక్షిస్తున్నారు.