చిరంజీవి-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా157 వర్కింగ్ టైటిల్‌తో
హైదరాబాద్: విశ్వావసు నామ ఉగాది పండుగ రోజు(ఆదివారం) చిరంజీవి-దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి వెంకటేష్ గెస్ట్ గా వచ్చాడు.. అల్లు అరవింద్, రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వెంకటేష్ చిరంజీవి పై క్లాప్ కొట్టారు..ఇక చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాని షైన్ స్క్రీన్స్ తో పాటు చిరంజీవి కూతురు సుస్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి.. ఇందులో చిరంజీవి అసలు పేరుతో (శంకర్ వరప్రసాద్) నటించనున్నారు.. దర్శకుడు అనిల్, తనదైన మార్క్ కామెడీ, యాక్షన్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు..మెగా157 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమలు జరగనున్నాయి..భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.