సంస్కృతి మరిచిపోతే మన ఉనికిని కోల్పోతాం-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: నాగరికత, సంస్కృతి మరిచిపోతే మన ఉనికిని కోల్పోతాం,,నాగరికత, సంస్కృతిని అనుసంధానిస్తూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు..ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు..పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు.. ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు..ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు..ప్రతి ఒక్కరి జీవితంలో ఉగాది పండుగ నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.. పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలని,, 25 ఏళ్లలో అమెరికాలోని అమెరికన్ల కంటే రెండింతల ఆదాయాన్ని తెలుగుజాతి సంపాదించిందని వెల్లడించారు..సమస్యలను అధిగమించే ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు.. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు..ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, అధికారులు పాల్గొన్నారు.